ముద్దరాలు - Muddaralu
లలిత గీతాలు
•
Music
Wishing the new bride while decorating her as part of Sampradaya series depicting our traditions for key life events
Lyrics below:
పల్లవి.
ముద్దరాలై మురియుచున్న మోహనాంగికి హారతిచ్చి
మంగళం అని పాడరమ్మా
అక్షతల దీవించరమ్మా......ముద్దరాలై.
అనుపల్లవి.
కోటి కోర్కెల కలలన్నీ
కమ్మగా ఫలియించవలెనని
పార్వతి కి పరమేశ్వరుని కి
ప్రణతు లర్పణ చేసి మ్రొక్కీ...............ముద్దరాలై.
చరణం1
పాదములకు పసుపు పూసీ
బుగ్గనూ చుక్కనూ బెట్టి
అరచేతుల గోరింటాకు
అందముగ అమరించరమ్మా
పసుపు పూసిన పాదములకు
కెంపుల పారాణి అలది
పండిన ముంజేతులకు
రత్నాల గాజులు తొడగరమ్మా..ముద్దరాలై.
చరణం2
పసుపు కొమ్ములు రోటనుంచీ
పన్నుగల రోకళ్ళబూనీ
కన్నతల్లులు ముత్తైదువులూ
కంకణాలూ ఘల్లుమనగా
పసుపు దంచీ దీవించీ
తాంబూలమందుకోనీ
వేయి శుభములు కలుగు గాకని
వేద మంత్రాక్షతలతో...,....ముద్దరాలై.
-----
Up Next in లలిత గీతాలు
-
జయ మంగళం - Jaya Mangalam
Wishing the new vatuvu as part of Sampradaya series depicting our traditions for key life events
Lyrics
వటువునకు మంగళ హారతి.
పల్లవి
జయ మంగళం బనరే వటువునకు
శుభ మంగళం బనరే...
అనుపల్లవి.
శుభముహూర్తమ్మున గాయత్రి
నర్చించి
బ్రహ్మొపదేశమ్ము నందిన వటువునకు.,......జయమంగళం.
చరణం.1
ప్రత్యక్ష దైవంబు సూర్యనా... -
నిన్న మొన్న - Ninna Monna
Celebrating first vonee for a girl as part of Sampradaya series depicting our traditions for key life events
Lyrics Below
ఓణీల పండగ.
పల్లవి
నిన్నమొన్న కనుతెరచిన పసిబాలవమ్మా
ఇంతలోనె పైటచాటు పడతివైనావమ్మా.....నిన్నమొన్న.
చరణం.1
అమ్మమ్మకు తొలి ముద్దుల మనవరాలివే
అమ్మకన్న కలలపంట తొలిచూలువే
నానమ్మకు... -
చిన్నారి పాపకు - Chinnari Papaku
Uyyala song as part of Sampradaya series depicting our traditions for key life events.
Lyrics belowపల్లవి.:
చిన్నారి పాపకు శ్రీ రామ రక్ష.ను
వ్వూగేటి ఊయలకు దిక్కు లే రక్ష. ,.....చిన్నారి.అనుపల్లవి.
తొలి ఊయల నీకూ అమ్మ ఒడీ
మలిఊయల నీకు అమ్మమ్మ ఒడీ
తొలి ఊయల నీకు అమ్మ ఒడీ
మలి ఊయల నానమ...