నిన్న మొన్న - Ninna Monna
లలిత గీతాలు
•
Music
Celebrating first vonee for a girl as part of Sampradaya series depicting our traditions for key life events
Lyrics Below
ఓణీల పండగ.
పల్లవి
నిన్నమొన్న కనుతెరచిన పసిబాలవమ్మా
ఇంతలోనె పైటచాటు పడతివైనావమ్మా.....నిన్నమొన్న.
చరణం.1
అమ్మమ్మకు తొలి ముద్దుల మనవరాలివే
అమ్మకన్న కలలపంట తొలిచూలువే
నానమ్మకు తొలిముద్దుల మనవరాలి వే
అమ్మకన్న కలలపంటతొలిచూలువే
ఇందరి కన్నుల వెలుగు కాంతి రేఖవే
అందరి దీవెనలంద కొలువు తీరినావే.........నిన్న మొన్న.
చరణం2
మేనమామలు ముద్దు మురిపాలు తీర్చగా
మేనత్తలు నీకు అందచందాలు కూర్చగా
పార్వతీ ఈశ్వరులకు
ప్రణతు లర్పణచేసీ
ముత్తైదువులందరీ దీవెనలర్ధించగా.......నిన్న మొన్న.
చరణం3.
ముక్కోటి దేవతలు శుభమని దీవింప,
కర్పూర హారతిని కన్ను లకద్దించీ
భరతమాత పేరు నిల్పు భాగ్యాల
,రాశివై
స్త్రీ జాతికే నీవు మకుటమ్ము కావాలి......నిన్నమొన్న.
Up Next in లలిత గీతాలు
-
చిన్నారి పాపకు - Chinnari Papaku
Uyyala song as part of Sampradaya series depicting our traditions for key life events.
Lyrics belowపల్లవి.:
చిన్నారి పాపకు శ్రీ రామ రక్ష.ను
వ్వూగేటి ఊయలకు దిక్కు లే రక్ష. ,.....చిన్నారి.అనుపల్లవి.
తొలి ఊయల నీకూ అమ్మ ఒడీ
మలిఊయల నీకు అమ్మమ్మ ఒడీ
తొలి ఊయల నీకు అమ్మ ఒడీ
మలి ఊయల నానమ... -
సీమంతం పాట - Seemantham Paata
-
మాదే ఈ తరం వందేమాతరం - maade ee taram