జయ మంగళం - Jaya Mangalam
Sampradaya Series 1
•
Music
Wishing the new vatuvu as part of Sampradaya series depicting our traditions for key life events
Lyrics
వటువునకు మంగళ హారతి.
పల్లవి
జయ మంగళం బనరే వటువునకు
శుభ మంగళం బనరే...
అనుపల్లవి.
శుభముహూర్తమ్మున గాయత్రి
నర్చించి
బ్రహ్మొపదేశమ్ము నందిన వటువునకు.,......జయమంగళం.
చరణం.1
ప్రత్యక్ష దైవంబు సూర్యనారాయణుడు
ఆహుతులనందుకొను అగ్ని దేవుండూ
మంత్ర దేవతలైన గాయత్రి సావిత్రి
బుధ్ధిబలములనిచ్చి బ్రోచిరక్షించగ,
,.....జయమంగళంబనరే.
చరణం2
త్రివిక్రముండైన వామనుని పగిదీ
శక్తి యుక్తులతోడ వెలుగంగ దీవించి
భరత సంస్కృతి కీర్తి నలుదెసల చాటగా
ధర్మ పధమున నడచి దైవ బలమును పొంద......జయమంగళం. బనరే
చరణం3.
మాతృదేవోభవ...పితృదేవోభవ...
ఆచార్య దేవోభవ...అతిథి దేవోభవ
అన్నభిక్షను కోరి అమ్మ నర్ధించీ
తాత ముత్తాతల శక్తి తండ్రి నర్ధించీ
జ్ఞాన భిక్ష ను కోరి గురువు నర్ధించీ
సంఘబలమును కోరి అతిథులకు
కైమోడ్చు.వటువునకు మంగళం
బనరే...జయమంగళం బనరే.
శుభ మంగళం బనరే.
------